Vishwak Sen | పోలీస్ గా విశ్వక్ సేన్

Vishwak Sen as IPS- విశ్వక్ సేన్ ఐపీఎస్ గా కనిపించబోతున్నాడు. కొత్త సినిమా లాంఛ్ చేశాడు.

Advertisement
Update:2024-08-16 09:18 IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 13వ మూవీ ప్రారంభమైంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీధర్ గంటా ను దర్శకుడిగా పరిచయం చేస్తూ విశ్వక్ ఈ సినిమా చేయబోతున్నాడు.

ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు విశ్వక్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలిటికల్ యాక్షన్ సినిమా ఇది. తాజాగా జరిగిన లాంఛ్ లో నిర్మాతలు నాగవంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు వశిష్ట క్లాప్‌ ఇచ్చాడు.

శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశాడు. మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ బ్యూటీ సంపద కూడా ఈ వేడుకకు హాజరైంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రీలుక్ ఇదివరకే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తంగలన్ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News