ఆర్యన్ గా మారిన విష్ణు విశాల్

విష్ణు విశాల్ మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నాడు. సినిమా పేరు ఆర్యన్. తాజాగా లాంఛ్ అయింది ఈ మూవీ.

Advertisement
Update:2022-09-03 15:57 IST

ప్రస్తుతం తెలుగు-తమిళ భాషల్లో మట్టి కుస్తీ అనే సినిమా చేస్తున్నాడు హీరో విష్ణు విశాల్. దీనికి హీరో రవితేజ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇది సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా స్టార్ట్ చేశాడు ఈ హీరో. ఈసారి ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

విష్ణు విశాల్ హీరోగా, ప్రవీణ్ కె దర్శకత్వంలో, దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్‌, వాణీ భోజన్‌ హీరోయిన్లు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. రేసీ స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఈ సినిమా రాబోతోందట.

ఇందులో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో విష్ణు విశాల్ ఖాకీ యూనిఫాంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ చిత్రంలో సాయి రోనక్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సామ్ సిఎస్ సంగీత దర్శకుడు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల అవుతుంది ఆర్యన్. 




 


Tags:    
Advertisement

Similar News