Vishal - మరోసారి ఫైర్ అయిన విశాల్
Vishal - ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే విశాల్, మరోసారి తన మార్క్ చూపించాడు. కొంతమంది నిర్మాతలపై విరుచుకుపడ్డాడు.
చాలా అంశాలపై ముక్కుసూటిగా ఉంటాడు విశాల్. మొన్నటికిమొన్న ముంబయిలో సెన్సార్ బోర్డుపై బోల్డ్ గా ప్రకటనలు చేశాడు. సాక్ష్యాలతో సహా అవినీతిని బయటపెట్టాడు. ఈసారి ఏకంగా అతడిపైనే విమర్శలు, ఆరోపణలు రావడంతో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.
అధికారంలో ఉన్నప్పుడు నడిగర్ సంఘం నిధుల్ని విశాల్ దుర్వినియోగం చేశాడని, తప్పుదోవ పట్టించాడనేది అతడిపై ఆరోపణ. దీనిపై విశాల్ సీరియస్ అయ్యాడు.
సంఘంలో సమిష్ఠిగా తీసుకున్న నిర్ణయాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించాడు. పైగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఉన్న వృద్ధ-పేద నిర్మాతల సంక్షేమం కోసం నిధులు వాడమని.. పండగ సమయాల్లో ఆయా కుటుంబీలకు అవసరమైన వస్తువులు కొనడంతో పాటు, కుటుంబలో చదువుల కోసం, మెడికల్ ఇన్సూరెన్స్ కోసం డబ్బు ఖర్చు చేశామని స్పష్టం చేశాడు
తనను సినిమాలు చేయకుండా అడ్డుకోవడానికి ప్రొడ్యూసర్లమని చెప్పుకునే కొంతమంది పనిలేని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని, దమ్ముంటే సినిమాలు తీయకుండా తనను అడ్డుకోవాలని ఛాలెంజ్ చేశాడు,.