Vaarasudu: వారసుడు సోల్ సాంగ్ రిలీజ్

Vaarasudu: విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఈసారి సినిమా థీమ్ తెలియజేసే మంచి మెలొడీ వచ్చింది.

Advertisement
Update:2022-12-21 17:43 IST

దళపతి విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న సినిమా వారసుడు. తెలుగు, తమిళంలో సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. చార్ట్‌బస్టర్ నంబర్ రంజితమే ఇప్పటివరకు 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. రెండో పాట "థీ దళపతి" కూడా మ్యూజికల్ చార్టుల్లో అగ్రస్థానంలో ఉంది. తాజాగా 'ఇట్స్ ఫర్ యూ అమ్మ' అనే మూడో సింగిల్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ పాట వారసుడు సోల్, కథకు కీలకమైన అమ్మ సెంటిమెంట్‌ను తెలియజేస్తోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు. తమన్ సంగీతం అందించాడు.

ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, యోగి బాబు, సంగీత ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు.


Full View


Tags:    
Advertisement

Similar News