Vijay Deverakonda | విజయ్ దేవరకొండ 'డబుల్'

Vijay Deverakonda - కెరీర్ లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఆ మూవీ వివరాలు మీకోసం..

Advertisement
Update:2024-05-13 14:44 IST

కెరీర్ లో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు విజయ్ దేవరకొండ. తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలోనే విజయ్, డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడట.

1854-1878 మధ్యకాలంలో జరిగిన స్టోరీగా, రాబోతోంది ఈ పీరియాడిక్ సినిమా. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ కనిపిస్తాడని సమాచారం. ఒక పాత్రలో అతడు సైనికుడిగా కనిపిస్తాడట. రాహుల్ సంకృత్యాన్ సినిమాలన్నీ కొత్తగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా పూర్తయిన వెంటనే, రాహుల్ సంకృత్యాన్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో మరో సినిమా కూడా ఉంది.

దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి దిల్ రాజు సినిమా ముందుగా సెట్స్ పైకి వస్తుందా, రాహుల్ సంకృత్యాన్ మూవీ ముందుగా వస్తుందా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ