Vijay Deverakonda | అది పొగరు లేదా బలుపు కాదు

Vijay Deverakonda - గతంలో 200 కోట్లు కొల్లగొడతానని ప్రకటించి అభాసుపాలయ్యాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడా అంశంపై మరోసారి స్పందించాడు.

Advertisement
Update: 2024-04-03 16:17 GMT

హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా "ఫ్యామిలీ స్టార్". ఓ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తన మనసులో మాటలు చెప్పాడు.

"గీతగోవిందం వంద కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. వంద కోట్ల రూపాయల వసూళ్ల సినిమా అందుకోవాలి అని చెప్పిన నేను, ఓ సినిమా 2 వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుందని చెప్పాను. కానీ అలా జరగలేదు. అలా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావు అని నాతో చాలా మంది అన్నారు. నీ వయసు హీరో అలా మాట్లాడితే అహంకారం అనుకుంటారు అని ప్రేమతో నాకు చెప్పిన పెద్దవాళ్లున్నారు. 2 వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా...రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. నేను ఉదయం లేచినప్పడు, షూటింగ్ కు వెళ్లినప్పుడు, ఈ వేదిక మీద మాట్లాడేప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో ఉంటా. ఇంకొకరు స్టార్ కాగా లేనిది మనం కాలేమా, మీరు కాలేరా, ఇంకొకరు రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ కొట్టగా లేంది నేను ఆ ఫీట్ సాధించలేనా."

ఇలా తన గత స్టేట్ మెంట్ పై స్పందించాడు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ సినిమా కచ్చితంగా 200 కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని పరోక్షంగా వెల్లడించాడు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News