Vijay Deverakonda | పెళ్లి చేసుకుంటానంటున్న విజయ్ దేవరకొండ
Vijay Deverakonda - తొలిసారి తన పెళ్లిపై స్పందించాడు విజయ్ దేవరకొండ. తన స్నేహితులు చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారని, తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందన్నాడు.
లవ్ స్టోరీలు చేయనని ఒకప్పుడు ప్రకటించాడు. పెళ్లి కూడా చేసుకోనని ఎనౌన్స్ చేశాడు. కట్ చేస్తే, ఖుషి సినిమా టైమ్ లో ఈ రెండు అభిప్రాయాల నుంచి వెనక్కు తగ్గాడు హీరో విజయ్ దేవరకొండ. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.
"మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఖుషి. ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. పరస్పరం అర్థం చేసుకోవడం, ప్రేమను పంచడం ..ఈ రెండు క్వాలిటీస్ జీవిత భాగస్వామికి ఉండాలి. కష్టసుఖాల్లో ఒకరికి మరొకరు సపోర్ట్ గా నిలవాలి. అప్పుడే బంధాలు నిలుస్తాయి. ఒకప్పుడు నా దగ్గర ఎవరూ పెళ్లి మాట ఎత్తేవారు కాదు. కానీ ఈ మధ్య నా స్నేహితులు పెళ్లి చేసుకోవడం, వాళ్ల జీవితాలు చూస్తుంటే నాకు పెళ్లి మీద అయిష్టం పోయింది. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఛాప్టర్. నేనూ ఆ ఛాప్టర్ లోకి అడుగుపెడతా."
మొన్నటివరకు ప్రేమకథలపై తనకు ఆసక్తి తగ్గిపోయిందని, కానీ ఖుషి సినిమా కథ విన్న తర్వాత బ్యూటిఫుల్ ఫీలింగ్ కలిగిందని అన్నాడు విజయ్ దేవరకొండ. మళ్లీ ప్రేమకథల్లో నటించాలనే ఆసక్తి కలిగిందన్నాడు.
ఖుషి సినిమా ట్రయిలర్ లాంఛ్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ, ఇలా తన పెళ్లి, ప్రేమ లాంటి అంశాలతో పాటు.. చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చాడు. వెబ్ సిరీసుల్లో నటించనని క్లారిటీ ఇచ్చిన ఈ హీరో.. తన పేరుకు ముందు బిరుదులు తగిలించడానికి అంగీకరించనని చెప్పాడు. అందుకే 'ది విజయ్ దేవరకొండ' అని మాత్రమే టైటిల్స్ లో వేయించుకుంటున్నానని తెలిపాడు.