Vijay Deverakonda | కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda | వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ మరో సినిమా ప్రకటించాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతోంది ఈ మూవీ.
Vijay Deverakonda | కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్‌తో సినిమా కన్ ఫర్మ్ చేశాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్, కీడా కోల సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ చిత్రం నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సినిమా ప్రకటించాడు విజయ్.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో పెద్ద స్టార్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత, ప్రేక్షకులు మళ్లీ ఈ కాంబోని చూడాలని కోరుకున్నారు, చాలా సార్లు, వీళ్లిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ మూవీ మెటీరియలైజ్ కాలేదు. ఎట్టకేలకు ఇద్దరి మధ్య కథ కొలిక్కి వచ్చినట్టుంది. విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్‌తో ఒక చిత్రాన్ని ధృవీకరించాడు.
తను, తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు స్క్రిప్ట్‌ను లాక్ చేశామని, త్వరలో సినిమా జరుగుతుందని అతను అధికారికంగా ప్రకటించాడు. దీంతో పెళ్లిచూపులు కాంబో రిపీట్ కాబోతోందన్నమాట.
ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్‌లను ఎలా కలిశాను అనే వివరాలను బయటపెట్టాడు. కీడా కోలా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం విజయ్, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే, గౌతమ్ తిన్ననూరితో ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత తరుణ్ భాస్కర్‌తో సినిమా ఉంటుంది.