Vijay Deverakonda - కొత్త సినిమా స్టార్ట్ చేసిన దేవరకొండ

Vijay Deverakonda - హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా లాంఛ్ అయింది. కెరీర్ లో అతడికిది 12వ చిత్రం.;

Advertisement
Update:2023-05-03 23:00 IST
Vijay Deverakonda - కొత్త సినిమా స్టార్ట్ చేసిన దేవరకొండ
  • whatsapp icon

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని ఇప్పటికే ఎనౌన్స్ చేశాయి. ఇప్పుడా సినిమా లాంచ్ అయింది. కెరీర్ లో విజయ్ దేవరకొండకు 12వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పలువురు ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ‘VD12’ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు, తన చేతుల మీదుగా స్క్రిప్ట్ ని చిత్ర బృందానికి అందజేశారు. ముహూర్తపు షాట్ కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ శ్రీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేశారు.

గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. ‘జెర్సీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి మరో డిఫరెంట్ కథతో సిద్ధమయ్యాడు తిన్ననూరి.

ఈ చిత్రంలో విజయ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. ఓపెనింగ్ కు ఆమె కూడా హాజరైంది. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ‘జెర్సీ’తో జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.

Tags:    
Advertisement

Similar News