ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది.;

Advertisement
Update:2025-03-04 21:08 IST

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యకు యత్నించింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలోని తన స్వగృహంలో నిద్రమాత్రలు మింగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కల్పన ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలియగానే పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, కల్పన ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్‌లో అత్యంత ప్రముఖ గాయని కల్పన ఒకరు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అనేక సాంగ్స్ పాడారు. ఏఆర్‌ రెహమాన్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవీ మహాదేవన్‌తో కలిసి ఆమె ఎన్నో మధురమైన పాటలు పాడారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tags:    
Advertisement

Similar News