వీవీ వినాయక్ హెల్త్‌పై క్లారీటీ ఇచ్చిన ఆయన టీమ్
వీవీ వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీమ్ పేర్కొంది.;
Advertisement
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్ హెల్త్‌పై కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీమ్ పేర్కొంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేసింది. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన టీమ్ హెచ్చరించింది.
ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనేది ఆ వార్తల సారాంశం. పలు మాధ్యమాల్లో ఈ వార్తలు ప్రచారం కావడం గమనార్హం. దీంతో ఈ ఫేక్ వార్తలపై ఆయన టీమ్ తాజాగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఒక నోట్‌ను కూడా టీమ్ విడుదల చేసింది. కాగా గతేడాది ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసిన ఆయన ప్రస్తుతం ఏ మూవీ చేయడం లేదు.
Advertisement