పోసాని కృష్ణమురళికి ఈ నెల 20 వరకు రిమాండ్
నటుడు పోసానికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది.;
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ పై పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చిన భవానీపురం పోలీసులు నేడు ఛీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు, వారి కుటుంబసభ్యులపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఒకే రకమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని తెలిపారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని న్యాయమూర్తికి వివరించారు. కాగా, రిమాండ్ విధించిన నేపథ్యంలో, పోసానిని మళ్లీ కర్నూలు జిల్లా జైలుకు తరలించనున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళికి మార్చి 20వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.