Vidya Vasula Aham - మరో డైరక్ట్ ఓటీటీ రిలీజ్

Vidya Vasula Aham - రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా విద్యా వాసుల అహం. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

Advertisement
Update:2024-05-08 07:35 IST
Vidya Vasula Aham - మరో డైరక్ట్ ఓటీటీ రిలీజ్
  • whatsapp icon

ఓవైపు థియేట్రికల్ రిలీజెస్ తో పాటు, ఓటీటీ రిలీజ్ లు కూడా జోరుగా నడుస్తున్న టైమ్ ఇది. మొన్నటికిమొన్న మై డియర్ దొంగ అనే సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. అభినవ్ గోమటం ఇందులో హీరోగా నటించాడు. దీనికి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సినిమా నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. దీని పేరు విద్య వాసుల అహం.

టైటిల్ లోనే ఈ సినిమా కథ ఏంటనేది చెప్పేశారు. విద్య, వాసు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇగోల కారణంగా వాళ్ల లైఫ్ ఎలా మారిందనేది ఈ సినిమా స్టోరీ. కొత్తగా పెళ్ళైన కపుల్ కథలతో తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ మూవీ మాత్రం కొంచెం ప్రత్యేకం అని చెబుతోంది యూనిట్.

రాహుల్ విజయ్ వాసు గా, శివాని రాజశేఖర్ విద్య పాత్రలో భార్యభర్తలు అని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. టైటిల్ లో కూడా వివాహం అనేది హైలైట్ అయ్యేలా ఉంది. ట్యాగ్ లైన్ ‘ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ ‘ అని ఉంది. ఈ మోడ్రన్ డేస్ లో పెళ్ళైన జంటల మధ్య ప్రేమతో పాటు ఇగో కూడా ఉంటోంది. దాన్ని హైలెట్ చేస్తూ ఈ సినిమా తీశారు.

ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మహేష్ దత్త నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ గెల్లి దర్శకుడు. ఈ సినిమా అయినా తన కెరీర్ కు కలిసొస్తుందని భావిస్తోంది శివానీ. మూవీలో అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.

Tags:    
Advertisement

Similar News