Venkatesh Daughter | త్వరలోనే వెంకటేష్ రెండో కూతురు పెళ్లి

Venkatesh Daughter - తన రెండో కూతురుకు పెళ్లి చేయబోతున్నారు హీరో వెంకటేశ్. తాజాగా నిశ్చితార్థం పూర్తయింది.

Advertisement
Update:2023-10-26 19:39 IST

వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్థం పూర్తయింది. ఆమె పేరు హయవాహిని. త్వరలోనే ఆమె పెళ్లిని దగ్గుబాటి కుటుంబం గ్రాండ్ గా చేయబోతోంది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ వైద్యుడి కుటుంబంతో ఆమె పెళ్లి జరగబోతోంది.

విజయవాడలో నిశ్చితార్థ వేడుక అక్టోబర్ 25న ఘనంగా జరిగింది. దగ్గుబాటి కుటుంబం మొత్తం ఈ ఆనందకరమైన ఈవెంట్‌ను జరుపుకోవడానికి వెళ్లింది. నిశ్చితార్థ వేడుకకు ఇరువైపుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకకు మహేష్ బాబు, చిరంజీవి, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. హయవాహిని కాబోయే భర్త గురించి తెలిసిన ఏకైక విషయం ఏమిటంటే, అతను విజయవాడలోని వైద్యుల కుటుంబం నుండి వచ్చాడు.

తన పిల్లల విషయంలో లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు వెంకటేశ్. వాళ్లను సెలబ్రిటీలుగా కాకుండా, సామాన్యులుగా పెంచారు. తమ నిర్ణయాలు తామే తీసుకునేలా, తమ కెరీర్ ను తామే ఎంచుకునేలా ప్రోత్సహించారు. వెంకటేష్ కు నలుగురు పిల్లలు. వీళ్లలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఆశ్రిత 2019లో వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి జైపూర్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఇప్పుడు రెండో కూతురు పెళ్లి చేస్తున్నారు.

కెరీర్ లో వెంకటేష్ పీక్ స్టేజ్ లో ఉన్నారు. F3, ఓరి దేవుడా సినిమాలు చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సైంధవ్ సినిమా చేస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రం, జనవరి 12న విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News