Venky75 | వెంకీ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ

Venkatesh - కలియుగ పాండవుల నుంచి సైంధవ్ వరకు 75 సినిమాల ప్రస్థానాన్ని పూర్తిచేశారు వెంకటేష్.

Advertisement
Update:2023-12-29 22:16 IST

సైంధవ్ తో 75 సినిమాలు పూర్తి చేసుకున్నారు విక్టరీ వెంకటేశ్. కలియుగ పాండవులు సినిమా నుంచి సైంధవ్ వరకు ఆయన కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. హయ్యస్ట్ సక్సెస్ రేటు కలిగిన హీరోగా, ఎక్కువ రీమేక్స్ చేసిన నటుడిగా, వెంకీ రికార్డ్ సృష్టించారు. విక్టరీ వెంకటేష్ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘సెలబ్రేటింగ్ వెంకీ 75’ పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నారు వెంకీ. తన ‘మల్లీశ్వరి’ నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్‌, ప్రేమ కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నా. మేం కలిసి సినిమా చేయాలనేది తన కోరిక, నా కోరిక కూడా. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుంది'' అన్నారు.

విక్టరీ వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘గురువు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘కలియుగ పాండవులు’తో నా ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాల్ని గమనించి ప్రోత్సహించారు. మొదట్లో ‘విక్టరీ’ అనేవారు. తర్వాత ‘రాజా’ అని పిలిచారు. కొన్నాళ్లు ‘పెళ్లికాని ప్రసాద్‌’ అన్నారు. తర్వాత ‘పెద్దోడు’, ‘వెంకీ మామ’ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను.’ అన్నారు

Tags:    
Advertisement

Similar News