వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!

వీరి హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. Venky Anil3, SVC58 వ‌ర్కింగ్ టైటిల్స్ తో సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన మేక‌ర్స్‌.. జూలై 3 వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛ‌నంగా షూటింగ్ ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలియ‌జేశారు.

Advertisement
Update: 2024-07-02 05:21 GMT

ఎఫ్2, ఎఫ్3 వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి మరోసారి వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరి హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. Venky Anil3, SVC58 వ‌ర్కింగ్ టైటిల్స్ తో సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన మేక‌ర్స్‌.. జూలై 3 వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛ‌నంగా షూటింగ్ ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ మేర‌కు ఒక పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. తాళి, గన్, గులాబీ పువ్వులతో చాలా ఇంట్రెస్టింగ్ గా తాజా పోస్ట‌ర్ డిజైన్ చేయ‌బ‌డింది. లవ్ స్టొరీ, మ్యారేజ్ తో పాటుగా యాక్షన్ కూడా కావాల్సినంత ఉంటుందని సింబాలిక్ గా మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. ఇక‌పోతే అనిల్ రావిపూడి, వెంకీ హ్యాట్రిక్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్‌ల‌ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. వెంక‌టేష్ కు వైఫ్ గా ఐశ్వ‌ర్య రాజేష్ మ‌రియు ప్రియురాలిగా మీనాక్షి చౌద‌రి క‌నిపించ‌నున్నార‌ని తాజాగా అనిల్ రావిపూడి క‌న్ఫార్మ్ చేశారు. జూలై 3 నుంచి షూటింగ్ ను స్టార్ట్ చేసి న‌వంబ‌ర్ నాటికి కంప్లీట్ చేస్తామ‌ని తెలిపారు. ఇక‌ అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌డం ఖాయం.


Tags:    
Advertisement

Similar News