Sankranthi Movies: ప్రీ-రిలీజ్ వేడుకలకు అడ్డంకులు

Sankranthi Movies: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ఇప్పటికే వేదికలు ఖరారు చేశారు. ఇప్పుడా వేదికల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.;

Advertisement
Update:2023-01-05 08:55 IST
Sankranthi Movies: ప్రీ-రిలీజ్ వేడుకలకు అడ్డంకులు
  • whatsapp icon

సంక్రాంతి సినిమాలకు ఊహించని అడ్డంకులు వచ్చి పడ్డాయి. చిరంజీవి, బాలయ్య నటించిన సినిమాల ప్రీ-రిలీజ్ ఫంక్షన్లకు అనుమతులు నిరాకరించింది ఏపీ సర్కార్. దీంతో ఇప్పుడీ సినిమా యూనిట్లు ఆలోచనలో పడ్డాయి.

చిరంజీవి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు. కానీ దానికి అనుమతి నిరాకరించింది ఏపీ ప్రభుత్వం. మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించింది.

అటు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఒంగోలులో ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాలి. కానీ ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్ లో ఫంక్షన్ చేస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు వేదికలు మార్చే పనిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు కొత్త వేదికలు ఖరారవుతాయి.

Tags:    
Advertisement

Similar News