Veera Simha Reddy: సుగుణ సుందరి ఎలా ఉందంటే..!

Veera Simha Reddy Movie song Suguna Sundari: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా నుంచి రెండో పాట రిలీజైంది. చూడ్డానికి రిచ్ గా ఉంది.

Advertisement
Update:2022-12-16 16:45 IST
Veera Simha Reddy Movie Run Time

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో పెద్ద సినిమా ఇదే

  • whatsapp icon

బాలకృష్ణ నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. టాప్ ఫామ్‌లో ఉన్న తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సాంగ్ జై బాలయ్య పెద్ద హిట్టయింది. ఇప్పుడు రెండో సాంగ్ వచ్చింది.

తమన్ ట్యూన్ లవ్లీగా కన్సిస్టెంట్ పేస్ తో ఆకట్టుకుంది. రామ్ మిరియాల, స్నిగ్ధ హై-పిచ్ వోకల్స్ తో ఈ పెప్పీ నెంబర్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మాస్‌ ని మెస్మరైజ్ చేయగా కొన్ని లైన్లు మరింత కిక్ ఇచ్చేలా ఉన్నాయి.

బాలకృష్ణ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క్లాస్‌ గా కనిపించినప్పటికీ, డ్యాన్స్‌లు మాస్‌ ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు శృతి హాసన్ తన ఎలిగెన్స్ తో కట్టిపడేసింది. డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల విందుగా ఉన్నాయి. ఈ పాటలో బాలకృష్ణ, శృతి హాసన్ కెమిస్ట్రీ రాకింగ్ గా ఉంది.

రిషి పంజాబీ తీసిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇస్తాంబుల్‌ లోని అందమైన ప్రదేశాలు ఆహ్లాదకరంగా చూపించారు. మొదటి పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మేకర్స్ రెండో పాటతో అంచనాలను మరింతగా పెంచారు.

ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 12న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తున్నాడు వీరసింహారెడ్డి. 


Full View


Tags:    
Advertisement

Similar News