Operation Valentine | విడుదలకు ముందే రూ.50 కోట్లు

Operation Valentine - వరుణ్ తేజ్ తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది.

Advertisement
Update:2023-09-29 22:50 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే చిత్రంగా రూపొందుతోంది 'ఆపరేషన్ వాలెంటైన్'.

జాతీయ నేపథ్యం, గ్రాండ్ స్కేల్ మేకింగ్ తో ఈ చిత్రం భారీ బజ్‌ను సంపాదించింది. తాజాగా సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు, (శాటిలైట్, డిజిటల్/స్ట్రీమింగ్, ఆడియో) అన్ని భాషలకు సంబంధించిన ఇతర హక్కులతో సహా రూ. 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. వరుణ్ తేజ్‌కి ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్.

ఈ విజువల్ గ్రాండియర్ తో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తుండగా, రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించిన మానుషి చిల్లర్ తెలుగులో అడుగుపెడుతోంది.

2022లో విడుదలైన ‘మేజర్’ సినిమా భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్ఖ, దేశభక్తి కథతో ఈ సినిమాను నిర్మిస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న సినిమా ఇదే.

‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 8న తెలుగు, హిందీలో విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News