Gandeevadhari Arjuna | 4 రోజుల్లో జరిగే సినిమా
Gandeevadhari Arjuna - 4 రోజుల్లో జరిగే కథతో తెరకెక్కింది గాండీవధారి అర్జున. అంతేకాదు, ఇందులో వరుణ్ తేజ్ గూఢచారి కాదు.
గాండీవధారి అర్జున సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు హీరో వరుణ్ తేజ్. ఓ మంచి సామాజిక సందేశంతో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని చెబుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి 2 అంశాలపై క్లారిటీ ఇచ్చాడు.
అంతా అనుకుంటున్నట్టు గాండీవధారి అర్జున సినిమాలో తనది గూఢచారి పాత్ర కాదంటున్నాడు వరుణ్ తేజ్. ఇక సినిమా కూడా 4 రోజుల్లో జరిగే కథతో తెరకెక్కిందని చెబుతున్నాడు.
"గాండీవధారి అర్జున స్పై సినిమా కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. సాధారణంగా మన దేశానికి చెందిన ప్రతినిధులు ఇతర దేశాల్లో చర్చలకు వెళ్లినప్పుడు వాళ్లు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకుంటారు. ఇలాంటి వాళ్లలో దేశ రక్షణ వ్యవస్థలో పని చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు. నేను అలాంటి వాళ్లలో ఒక్కడ్ని."
కథ డిమాండ్ మేరకే లండన్ లో షూట్ చేశామంటున్నాడు వరుణ్. రిచ్ విజువల్స్ కోసం లండన్ వెళ్లలేదని, కథలో లండన్ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నాడు.
"గాండీవధారి అర్జునలో ఏదో సందేశం ఇచ్చి మీరు మారాలని చెప్పటం లేదు. ఇప్పుడున్న సమస్య ఏంటి? అనే దాన్ని చూపిస్తున్నాం. దాని వల్ల ఎవరైనా మారితే మంచిదే. గాండీవధారి అర్జున కథ నాలుగు రోజుల్లో జరిగే సినిమాగా తెరకెక్కించారు. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో పాటు చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. కథ డిమాండ్ మేరకే సినిమాను లండన్ లో షూట్ చేశాం."
ఈరోజు థియేటర్లలోకి వచ్చింది గాండీవధారి అర్జన. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు.