Nindha Movie | ఈ సినిమాలో స్పెషాలిటీ ఇదే

Varun Sandesh Nindha Movie - నింద అనే సినిమా చేశాడు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటో చెప్పుకొచ్చాడు.

Advertisement
Update:2024-06-19 12:51 IST

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రం తెరకెక్కుతోంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే కాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు.

ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది.ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు హీరో వరుణ్ సందేశ్ మీడియా ముందుకు వచ్చారు.

"సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండబోతోంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. అసలు పూర్తి కథను, స్క్రిప్ట్‌ని ఆర్టిస్టులెవ్వరికీ నెరేట్ చేయలేదు. దీంతో నటించే ఆర్టిస్టుల్లోనూ ఓ క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్థుడు ఎవరు? అనే విషయం తెలియకపోవడంతో సహజంగా నటించారు. కథ చెప్పినప్పుడు నేను గెస్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ నేను కూడా చెప్పలేకపోయాను."

ఇలా నింద సినిమా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నాడు వరుణ్ సందేశ్. కానిస్టేబుల్ అనే సినిమా షూటింగ్ టైమ్ లో వరుణ్ సందేశ్ కాలికి గాయమైంది. అయినప్పటికీ నింద షెడ్యూల్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో రిస్క్ చేసి నటించాడట ఈ హీరో.

Tags:    
Advertisement

Similar News