Varsha Bollamma | హీరోతో ఎఫైర్ పై స్పందించిన హీరోయిన్
Varsha Bollamma - బెల్లంకొండ గణేష్ తో డేటింగ్ చేస్తున్నానంటూ తనపై వస్తున్న పుకార్లపై స్పందించింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ.
హీరోయిన్లపై ఊహాగానాలు రావడం సహజం. వర్ష బొల్లమ్మపై కూడా అలాంటి పుకారు ఒకటి ఈమధ్య బాగా వినిపించింది. హీరో బెల్లంకొండ గణేశ్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ లో ఉందని, ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనేది ఆ పుకారు.
ఇలాంటి రూమర్లను చూసీచూడనట్టు వదిలేస్తుంటారు చాలామంది హీరోయిన్లు. వర్ష బొల్లమ్మ మాత్రం స్పందించింది. గణేష్ తనకు కేవలం ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది.
"కనీసం మేం బెస్ట్ ఫ్రెండ్స్ అయి, బయట కలిసి తిరిగితే రూమర్స్ పుట్టించొచ్చు. రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడినా, ఎక్కడైనా కలుసుకున్నా ఇలాంటి ఊహాగానాలు రావొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. అలా ఏదైనా పుకారు రావొచ్చు. కానీ మా విషయంలో మాత్రం ఘోరం. మేం కనీసం మాట్లాడుకున్నది కూడా లేదు. గణేష్ మంచోడు, నాకు ఫ్రెండ్ కూడా. కానీ మేం మాట్లాడింది చాలా తక్కువ, ఈమధ్య కలుసుకున్నది కూడా లేదు."
అస్సలు టచ్ లో లేని వ్యక్తితో తనకు లవ్ అంటూ పుకార్లు వినిపించేసరికి షాక్ అయ్యానని తెలిపింది వర్ష. ఇప్పటికైనా గణేష్ తో ఎఫైర్ అంటూ వస్తున్న పుకార్లు ఆపేయాలని కోరింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే.