Varalaxmi Sarathkumar: సమంత ఆరోగ్యంపై వరలక్ష్మీ స్పందన

Varalaxmi Sarathkumar: సమంత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రాబ్లమ్ పై సమంతతో కొన్నాళ్లుగా పనిచేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు తెలుసా?

Advertisement
Update:2022-11-01 08:19 IST

వరలక్ష్మి శరత్ కుమార్

తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని బయటపెట్టింది సమంత. తను మయోస్టైటిస్ అనే సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య ఉన్నవాళ్లు తరచూ నీరసానికి గురవుతుంటారు. నడిచినా, నిల్చున్నా తొందరగా అలిసిపోతుంటారు. కండరాలు విపరీతంగా నొప్పి పెడుతుంటాయి. కొన్నాళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న సమంత, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది.

సమంతకు ఉన్న ఈ ఆరోగ్య సమస్యపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. సమంతతో కలిసి చాలా రోజుల పాటు యశోద సినిమా కోసం పని చేసిన వరలక్ష్మి, తను ఎప్పుడూ సమంతలో అలాంటి సమస్యను గుర్తించలేదని అంటోంది.

"షూటింగ్ టైమ్ లో నేను గమనించలేదు. ఆమె యాక్టివ్ గానే ఉంది. బహుశా, అప్పటికే ఆమె ఆ సమస్యతో ఉందేమో నాకు తెలీదు. కానీ బయటకు మాత్రం కనిపించలేదు. యశోద షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ సమస్యతో ఆమె మరింత బాధపడి ఉండొచ్చు. ప్రస్తుతం సమంత కోలుకుంటోంది. నాకు అదే కావాలి."

ప్రస్తుతం సమంత ఓవైపు చికిత్స తీసుకుంటూనే, మరోవైపు తన సినిమా పనుల్లో బిజీగా ఉంటోంది. చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెబుతోంది. సమంత త్వరగా కోలుకోవాలంటూ చిరంజీవితో పాటు చాలామంది స్టార్లు పోస్టులు పెట్టారు.

Tags:    
Advertisement

Similar News