Vamsi Paidipally: లైన్ చెబుతా, హీరో బట్టి సీన్స్ రాస్తా
Vamsi Paidipally Story Writing - తన స్టోరీ రైటింగ్ పై స్పందించాడు వంశీ పైడిపల్లి. కథకు హీరో ఓకే చెప్పిన తర్వాత సీన్స్ రాస్తానంటున్నాడు.
తన రైటింగ్ స్టయిల్ ను బయటపెట్టాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ముందుగా తను స్టోరీలైన్ మాత్రమే అనుకుంటానని, హీరో క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటానని, ఏ హీరో తన స్టోరీకి ఓకే చెబితే.. ఆ హీరో ఇమేజ్, మేనరిజమ్స్ కు తగ్గట్టు సన్నివేశాలు రాస్తానని అన్నాడు.
ఇప్పటివరకు ప్రతి సినిమాకు ఇలానే చేశాడట వంశీ పైడిపల్లి. తాజాగా వచ్చిన వారసుడు సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యాడంట.
"వారసుడులో హీరో విజయ్ కాకుండా వేరే ఎవరైనా ఉంటే చాలా సీన్స్ వేరేలా ఉండేవి. నేను మహేష్ బాబుతో 'మహర్షి'ని చేసినప్పుడు, మహేష్ కు బేసిక్ లైన్ మాత్రమే చెప్పాను. ఒకసారి ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత అతని ఇమేజ్ కి తగినట్లుగా సన్నివేశాలను రూపొందించాను. 'వారసుడు' విషయంలోనూ అదే జరిగింది."
ఇలా తన స్టయిల్ ను బయటపెట్టాడు వంశీ పైడిపల్లి. అందుకే మున్నా సినిమా ప్రభాస్ కోసం, బృందావనం సినిమా ఎన్టీఆర్ కోసం పుట్టినట్టు అనిపిస్తాయన్నాడు.