ఉపేంద్ర యుఐ టీజర్ విడుదల

హీరో ఉపేంద్ర నటించిన చిత్రం యూఐ.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Advertisement
Update:2024-12-02 13:43 IST

కన్నడ ప్రముఖ హీరో ఉపేంద్ర నటించిన చిత్రం యూఐ.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కిస్మస్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయానున్నారు. ఉపేంద్ర స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం యూఐ. దాదాపు 8 ఏండ్ల‌ విరామం త‌ర్వాత ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఉపేంద్ర‌. మనోహరన్- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతర ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ టీజ‌ర్ చూస్తుంటే.. ‘

UI’ అనే ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌లో ఈ సినిమా కధ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. గ్లోబ‌ల్ వార్మింగ్, ఏఐ, క‌రోనా, ఆర్థిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, యుద్ధాలతో ముగిసిన అనంత‌రం 2040లో భూమి ఎలా ఉండ‌బోతుంది.. ప్ర‌జ‌లు ఎలా జీవిస్తున్నారు. భూమిని కాపిటలిస్ట్‌లు లాక్కోని ఎలా నాశ‌నం చేశారు అనేది ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు, క‌న్న‌డ‌, మ‌లయాళం, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు సినీ యూనిట్ వెల్ల‌డించింది.

Tags:    
Advertisement

Similar News