Toofan | విజయ్ ఆంటోనీ సినిమా వాయిదా

Toofan - లెక్కప్రకారం ఈరోజు థియేటర్లలోకి రావాలి తూఫాన్ సినిమా. ఇప్పుడీ సినిమా 9వ తేదీకి మారింది.

Advertisement
Update: 2024-08-02 17:26 GMT

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది.

పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి రావాలి. కానీ ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన షోరీల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అచ్చు రాజమణితో కలిసి విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News