Weekend Review | వీకెండ్ టాలీవుడ్ రివ్యూ
weekend Review - గత వారం రిలీజైన సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రమే అందరి నోళ్లలో నానుతోంది. కానీ దీనికి ఇంకా టైమ్ ఉంది.
మొన్న శుక్రవారం 4 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఒక సినిమా ఫలితం విడుదల రోజే తేలిపోయింది. మిగతా సినిమాలు పోటీపోటీగా నడిచాయి. వీటిలో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. భారీ హైప్ మధ్య రిలీజైన ఈ సినిమా ప్రతికూల సమీక్షల మధ్య ముగిసింది.
అయితే వసూళ్లలో మాత్రం నిలబడింది. మొదటి వారాంతం ఈ సినిమాకు ప్రపంచంవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత నిలబడిన మూవీ భజే వాయువేగం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కార్తికేయ నటించిన ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చాయి, దానికి తగ్గట్టే నెమ్మదిగా వసూళ్లు పెరుగుతున్నాయి.
ఇక ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశ సినిమా కూడా థియేటర్లలో కొనసాగుతోంది. ఈ సినిమాకు తెలంగాణలో పాజిటివ్ గా, ఏపీలో నెగెటివ్ గా టాక్ వచ్చింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. క్రైమ్ కామెడీ జానర్ కారణంగా కలెక్షన్లు నెమ్మదిగా, స్థిరంగా ఉన్నాయి. ఈ శుక్రవారం నాటికి ఈ సినిమాలు ఎలాంటి ఫలితాల్ని అందుకుంటాయో చూడాలి.
ఓవరాల్ గా చూసుకుంటే, ఈ 3 సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విజేతగా నిలిచింది. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. బ్రేక్ ఈవెన్ అయిన తర్వాతే ఈ సినిమా హిట్ స్టేటస్ ఏంటనేది తేలుతుంది.