Nayanthara Trisha | తెలుగు తెరపై ఇక వీళ్లు కనిపించరా?

Nayanthara and Trisha - నయనతార-త్రిష.. సౌత్ లో పాపులర్ హీరోయిన్లు. వీళ్లను టాలీవుడ్ మేకర్స్ దాదాపు మరిచిపోయినట్టే. దీనికి కారణం ఏంటి?

Advertisement
Update:2023-11-17 21:58 IST

నయనతార, త్రిషలను భరించలేక తెలుగు నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరు సీనియర్ నటీమణులకు ఇప్పటికీ మార్కెట్‌లో క్రేజ్ ఉంది. అందుకే ఇద్దరూ కోలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకోగలుగుతున్నారు. అయితే వీరి రెమ్యునరేషన్ తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే నయనతార, త్రిషలను భరించలేక తెలుగు నిర్మాతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.

సాధారణంగా, హీరోయిన్లు వయసు పెరిగే కొద్దీ అవకాశాలు కోల్పోతారు. ఆఫర్‌లు పొందడానికి చాలా కష్టపడతారు. కానీ నయనతార, త్రిష విషయంలో ఇది రివర్స్ లో జరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ వీళ్ల స్టార్ డమ్ పెరుగుతోంది. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఫలితంగా వీళ్ల పారితోషికాలు కూడా పెరిగాయి. టాలీవుడ్ నిర్మాతలకు అది ఇబ్బందికరంగా మారింది.

తాజాగా కొంతమంది నిర్మాతలు త్రిష, నయనతారను సంప్రదించారు. వీళ్లిద్దరూ చెరో 10 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేయడంతో, మరో మాట మాట్లాడకుండా మేకర్స్ వెనుదిరిగారు. ఈ లిస్ట్ లో చిరంజీవితో సినిమా చేయాలనుకున్న ఓ బడా నిర్మాత కూడా ఉన్నాడంట.

తమ రెమ్యూనరేషన్ విషయంలో ఈ ఇద్దరు హీరోయిన్లు కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే, టాలీవుడ్ మేకర్స్ ఇవ్వకపోతే, వాళ్లకు కోలీవుడ్ నుంచి ఆ మొత్తం వస్తోంది. అందుకే తెలుగు దర్శకనిర్మాతలు వెనక్కి తగ్గుతున్నా, వీళ్లు బాధ పడడం లేదు.

Tags:    
Advertisement

Similar News