Tiger Nageswar Rao | 'టైగర్'పై లియో ఎపెక్ట్
Tiger Nageswar Rao - రవితేజ హీరోగా నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు పాన్ ఇండియా రిలీజ మిస్సయింది.
లియో సృష్టిస్తున్న ప్రభంజనంతో టైగర్ నాగేశ్వరరావు తమిళ రిలీజ్ ఆలస్యమైంది. అవును, రవితేజ మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం, టైగర్ నాగేశ్వరరావు శుక్రవారం అన్ని భాషల్లో విడుదలైంది. ఒక్క తమిళ్ లో తప్ప. తమిళనాడులోని అన్ని స్క్రీన్‌లను లియో ఆక్రమించింది. దీంతో టైగర్ నాగేశ్వరరావు తమిళ వెర్షన్ వచ్చే వారం విడుదలవుతుంది. రిలీజ్ పోస్ట్ పోన్ చేయమని, డిస్ట్రిబ్యూటర్ స్టూడియో గ్రీన్ నిర్మాతను ఒప్పించింది. లియో తుఫానులో టైగర్ నాగేశ్వరరావును తమిళ ప్రేక్షకులు చూసే అవకాశం లేదు. కాబట్టి ఈ నిర్ణయం సరైనదే.
మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో నటించిన తెలుగు సినిమా టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా నార్త్‌లో టీమ్ సినిమాను దూకుడుగా ప్రమోట్ చేసింది. అయితే అదే వారాంతంలో తమిళంలో లియో లాంటి పెద్ద సినిమా విడుదలవుతుండడంతో టైగర్ నాగేశ్వరరావు తమిళ విడుదల ఆలస్యమైంది.
తమిళనాట స్టూడియో గ్రీన్ ప్రముఖ బ్యానర్. ఈ సంస్థ నుంచి టైగర్ నాగేశ్వరరావును గ్రాండ్‌గా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే లియో సినిమాకు హిట్ టాక్ రావడంతో, తమిళనాట రవితేజ సినిమాకు స్క్రీన్స్ దొరకలేదు. ఫలితంగా వాయిదా వేయక తప్పలేదు.
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, రేణు దేశాయ్, నాజర్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చాడు.