ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్

ఈ వారం ఓటీటీలో ప్రత్యేకాకర్షణ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, షాలినీ పాండే నటించిన హిస్టారికల్ డ్రామా ‘మహా రాజ్’. బ్రిటిష్ ఇండియాలో మహిళల హక్కుల కోసం పోరాడిన జర్నలిస్టు కమ్ న్యాయవాది కర్సందాస్ ముల్జీ నిజ కథతో ఇది రూపొందింది.

Advertisement
Update:2024-06-10 20:48 IST

ఈ వారం ఓటీటీలో ప్రత్యేకాకర్షణ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, షాలినీ పాండే నటించిన హిస్టారికల్ డ్రామా ‘మహా రాజ్’. బ్రిటిష్ ఇండియాలో మహిళల హక్కుల కోసం పోరాడిన జర్నలిస్టు కమ్ న్యాయవాది కర్సందాస్ ముల్జీ నిజ కథతో ఇది రూపొందింది. 1862 నాటి వివాదాస్పద మహారాజ్ లిబెల్ కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముల్జీ సత్యం కోసం, న్యాయం కోసం చేసే పోరాటం శక్తివంతమైన సామాజిక నిబంధనల్ని, వ్యక్తుల్నీ సవాలు చేసేలా వుంటుంది. సనాతనధర్మానికి వ్యతిరేకంగా ముల్జీ చేసిన ఈ న్యాయ పోరాటం దేశవ్యాప్త చర్చకి దారితీసింది. అలాగే 1987 నాటి లీగల్ థ్రిల్లర్ నవల ‘ప్రిస్యూమ్డ్ ఇన్నోసెంట్’ తో రూపొందిన షో కూడా ఈ వారం ప్రత్యేకం. ఇవే గాక ఈ వారం స్పోర్ట్స్ డ్రామాలు ఎక్కువ స్ట్రీమింగ్ అవుతున్నాయి. పూర్తి లిస్టు ఈ క్రింద చూడండి...

నెట్ ఫ్లిక్స్ లో

1. బ్రిడ్జర్టన్ సీజన్ 3, పార్ట్ 2 (ఇంగ్లీషు రోమాంటిక్ డ్రామా) - జూన్ 13

2. మహారాజ్ (హిందీ హిస్టారికల్ డ్రామా) -జూన్ 14

3. అల్ట్రామన్: రైజింగ్ (స్పోర్ట్స్ యాక్షన్ -జూన్ 14

4. జోకో అన్వర్స్ నైట్ మర్ అండ్ డే డ్రీమ్స్ (అతీంద్రియ సైన్స్ ఫిక్షన్) -జూన్ 14


Full View


జియో సినిమాలో

5. గాంత్, అధ్యాయం 1: జమ్నా పార్ (హిందీ మిస్టరీ థ్రిల్లర్) -జూన్ 11

ఆపిల్ టీవీ ప్లస్ లో

6. ప్రెస్యూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీషు లీగల్ థ్రిల్లర్) - జూన్ 12

బుక్ మై షోలో

7. టారో ( ఇంగ్లీషు అతీంద్రియ హార్రర్) -జూన్13

8. ఫాల్ గై (హాలీవుడ్ యాక్షన్) -జూన్ 14

అమెజాన్ ప్రైమ్ లో

9. ది బాయ్స్, సీజన్ 4 (స్పోర్ట్స్ డ్రామా) -జూన్ 13

జీ5 లో

10. పరువు (తెలుగు థ్రిల్లర్) -జూన్ 14

11. లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ రోమాంటిక్ కామెడీ) -జూన్ 14

లయన్స్ గేట్ ప్లేలో

12. ఐరన్ క్లా (స్పోర్ట్స్ డ్రామా) - జూన్ 14

Tags:    
Advertisement

Similar News