లైగర్ ఫ్లాప్‌కు కారణం ఇదే.. ఆర్జీవీ విశ్లేష‌ణ‌..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ జనాలకు కరణ్ జోహార్ పై కోపం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే అప్పటి నుంచి ఆయన సినిమాను బాయ్ కాట్ చేస్తూ వస్తున్నారు.

Advertisement
Update:2022-09-17 07:34 IST

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ చిత్రం ఇటీవల పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ ఎన్నో ఆశలు, అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా చివరకు ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా పరాజయంపై ఇప్పటికే రకరకాల విశ్లేషణలు సాగాయి. తాజాగా ఈ సినిమా పరాజయాన్ని ఆర్జీవీ తనదైన శైలిలో విశ్లేషించారు. ఇటీవల ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ దూకుడు స్వభావం కూడా లైగర్ పరాజయం పాలు కావడానికి ఓ కారణమని నేను భావిస్తున్నాను. కరణ్ జోహార్ పై జనాలకు ఉన్న కోపం కూడా మరో కారణం.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ జనాలకు కరణ్ జోహార్ పై కోపం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే అప్పటి నుంచి ఆయన సినిమాను బాయ్ కాట్ చేస్తూ వస్తున్నారు. సహజంగా తెలుగు హీరోలు చాలా వినయంగా ఉంటారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. వారి ప్రవర్తనను బాలీవుడ్ ప్రేక్షకులు గమనించారు.

ఈ వినయం బాలీవుడ్ హీరోల్లో ఉండదు. అందుకే వారికి సౌత్ హీరోలు నచ్చారు. కానీ విజయ్ దేవరకొండ ప్రవర్తన స్టేజి మీద వింతగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొన్ని వింత చేష్టలు చేస్తుంటాడు. విజయ్ ప్రవర్తన బాలీవుడ్ జనాలకు నచ్చి ఉండకపోవచ్చు' అని ఆర్జీవీ పేర్కొన్నాడు.

Tags:    
Advertisement

Similar News