బిగ్‌బాస్‌ సీజన్‌-8 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ వీళ్లే!

ఈ సీజన్‌లో మరింత జోష్‌ పెంచడానికి సీజన్‌-8 రీలోడ్‌ అంటూ హరితేజ, టేస్టీ తేజ, నైని పావని, మెహబూబ్‌లు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ

Advertisement
Update:2024-10-06 21:12 IST

ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ బిగ్‌బాస్‌ సీజన్‌-8 ప్రారంభమైన విషయం విదితమే. మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లు వెళ్లారు. ఆరుగురు ఎలిమినేట్‌ అయ్యారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం, వీకెండ్‌లో నైనిక హౌస్‌ నుంచి బైటికి వెళ్లారు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి అంతా సప్పగా ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్‌లో మరింత జోష్‌ పెంచడానికి సీజన్‌-8 రీలోడ్‌ అంటూ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలుగా హరితేజ, టేస్టీ తేజ, నైని పావని, మెహబూబ్‌లను పంపారు.

'హరితేజ' అనే బిగ్‌బాస్‌ పిలుపును బాగా మిస్సయ్యా

సీజన్‌-1 కంటెస్టెంట్‌ అయిన హరితేజ మళ్లీ బిగ్‌ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోతు తెలియకుండా దూకేస్తే ఎలాగో ఊదుకుంటూ వచ్చేయవచ్చు. కానీ తెలిసిన తర్వాత దూకాలంటే ఆ భయం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. 'హరితేజ' అనే బిగ్‌బాస్‌ పిలుపును బాగా మిస్సయ్యాను. అందుకే మళ్లీ వచ్చాను.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గేమ్‌ కూడా చూస్తారు

టేస్టీ తేజ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లోకి మళ్లీ వస్తానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే బిగ్‌ బాస్‌లోకి ఒకసారి అవకాశం రావడమే నాలాంటి వాడికి అదృష్టం. నా జీవితంలో జరిగిన అద్భతం ఇది. బిగ్‌బాస్‌ హౌస్‌కు రాకముందు బైటికి వచ్చిన తర్వాత టేస్టీ తేజ వేరు అన్నాడు. ఈ షోకు రాకుందు రెస్టారెంట్స్‌కు వెళ్లి ఫుడ్‌ వీడియోలు చేసుకునే వాడిని. ఈ ఎనిమిది నెల్లలో 14 రెస్టారెంట్స్‌ను ప్రారంభించాను. 'టీ ఫ్రాంఛైజీ' పేరుతో సొంతంగా వ్యాపారం కూడా ప్రారంభించాను. సుమారు 20 బ్రాంచీలు పెట్టాను. బిగ్‌బాస్‌ వల్లనే టేస్టీ తేజ నేమ్‌ ఫేమ్‌ జనాలకు తెలిసింది అన్నాడు.. గత సీజన్‌లో కేవలం ఎంటర్‌ టైనర్‌గా చూశారు. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గేమ్‌ కూడా చూస్తారు అన్నాడు.

ఈసారి నా ఆట వేరే లెవల్‌లో ఉంటుంది

బిగ్‌బాస్‌ సీజన్‌-7 కంటెస్టెంట్‌ అయిన నైని పావని వైల్డ్‌ కార్డ్‌ ద్వారా సీజన్‌-8లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉన్నది.గత సీజన్ లో బైటికి వెళ్లినప్పుడు నేను ఎంత ఫీలయ్యానో.. ప్రేక్షకులు అంతకంటే ఫీలయ్యారు. బహుశా వాళ్లు మళ్లీ కోరుకున్నారేమో. అందుకే మళ్లీ వచ్చాను. ఈసారి నా ఆట వేరే లెవల్‌లో ఉంటుందని పావని తెలిపింది.

మళ్లీ బిగ్‌బాస్‌లోకి ఛాన్స్‌ రావడం ఆనందంగా ఉన్నది

బిగ్‌బాస్‌ సీజన్‌-4 కంటెస్టెంట్‌ అయిన మెహబూబ్‌ నాలుగో వైల్డ్‌కార్డుగా సీజన్‌-8లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లైఫ్‌ చాలా హ్యాపీగా ఉన్నది. ప్రస్తుతం కొన్ని సాంగ్స్‌ చేస్తున్నాను. ఈ క్రమంలో మళ్లీ బిగ్‌బాస్‌లోకి ఛాన్స్‌ రావడం ఆనందంగా ఉన్నది. మ్యూజిక్‌ వీడియోలు డైరెక్ట్ చేస్తున్నాను. పారిస్‌, బార్సిలోనా, మెక్సికో ఒక పాటను షూట్‌ చేశాం. ఇండిపెండెంట్‌ పాటలను డెవలప్‌ చేయడం నా కల. వచ్చేటప్పుడు ఆ పాటకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసి వచ్చాను. ఈ సందర్భంగా సోహైల్ వీడియోను నాగార్జున ప్రసారం చేయగా.. అతను తన లైఫ్‌ టైమ్‌ ఫ్రెండ్ అని చెప్పాడు.

Tags:    
Advertisement

Similar News