Vyooham Movie Postponed | వర్మ ‘వ్యూహం’ విడుదల వాయిదా -సెన్సార్‌లో సమస్య!
Vyooham Movie Postponed | వర్మ రూపొందిస్తున్న రాజకీయ చిత్రాలు వ్యూహం, శపథం.. విడుదల నిలిపివేయాలని కోరుతూ నారా లోకేష్ సెన్సార్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై రివైజింగ్ కమిటీకి పంపించి ఉంటారని భావిస్తున్నారు.
Vyooham Movie Postponed | వర్మ ‘వ్యూహం’ విడుదల వాయిదా -సెన్సార్‌లో సమస్య!
Vyooham Movie Postponed | దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన పొలిటికల్ బేస్డ్ మూవీ ‘వ్యూహం’ విడుదల వాయిదా పడింది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర వర్గాలు తొలుత వెల్లడించాయి. అయితే తాజాగా ‘వ్యూహం’ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు దీనిని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్టు సమాచారం ఇచ్చారని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ వెల్లడించారు. అయితే రివైజింగ్ కమిటీకి ఎందుకు పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని ఆయన తెలిపారు.
వర్మ రూపొందిస్తున్న రాజకీయ చిత్రాలు వ్యూహం, శపథం.. విడుదల నిలిపివేయాలని కోరుతూ నారా లోకేష్ సెన్సార్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై రివైజింగ్ కమిటీకి పంపించి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ’అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ’వ్యూహం’ను ఆపలేరు’ అంటూ ట్వీట్ చేసిన వర్మ.. అందులో ‘పుష్ప’ చిత్రంలోని సీన్‌కి మీమ్ చేసి షేర్ చేశారు. ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్‌లో.. ’శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్‌ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం విడుదలకు సంబంధించి నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ స్పందిస్తూ.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.