SS Thaman | నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్

Thaman BRO movie - బ్రో మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ ను దేవుడిగా ఊహించుకొని ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడంట తమన్.

Advertisement
Update:2023-07-31 18:29 IST
SS Thaman | నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్
  • whatsapp icon

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూర్చాడు.

నిన్నటితో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ వేడక చేసింది. ఈ వేదికపై మాట్లాడిన తమన్.. త్రివిక్రమ్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

"నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటాను. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్. సముద్రఖని నాకు 20 ఏళ్ళ ముందు నుంచే తెలుసు. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డాను. అంత ఇష్టం సాయి అంటే. మనసుకి చాలా దగ్గరైన మనిషి. అందుకే సాయి తేజ్ సినిమాకి మనసుతో పని చేస్తాను. క్లయిమాక్స్ లో నా సంగీతంతో సాయి తేజ్ పై ప్రేమని చూపించాను."

ఇలా త్రివిక్రమ్ పై, సాయిధరమ్ తేజ్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు తమన్. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన తమన్, పవన్ కల్యాణ్ ను దేవుడిలా ఊహించుకొని బ్రో సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చానని తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News