ఎడ్ల బండి ఎక్కిన సూపర్ మేన్

తేజ సజ్జ, సూపర్ మేన్ పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా పేరు హనుమాన్. ఇప్పుడీ సినిమా నుంచి తేజ పోస్టర్ ఇంకోటి రిలీజైంది. దీనికి కారణం ఉంది

Advertisement
Update:2022-08-23 20:17 IST
ఎడ్ల బండి ఎక్కిన సూపర్ మేన్
  • whatsapp icon

కెరీర్ ప్రారంభం నుండే సబ్జెక్ట్‌ ల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈరోజు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హను-మాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. పుట్టినరోజు స్పెషల్ గా.. ఈ సినిమా నుంచి తేజ సజ్జా బ్రాండ్ న్యూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ప్రత్యేక శక్తులున్న సూపర్‌హీరో, ఇలా ఎడ్ల బండి ఎక్కి అమాయకంగా కనిపించడం, సినిమాపై ఆసక్తిని కాస్త పెంచింది. ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నాడు.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను, ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనుంది.

కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News