Tapsee Alia | అలియా భట్ పై తాప్సి సెటైర్

Tapsee Alia Bhatt - హీరోయిన్ అలియాభట్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది నటి తాప్సి.

Advertisement
Update:2023-07-18 17:34 IST

అలియా భట్ ప్రెగ్నెన్సీ గురించి అందరికీ తెలిసిందే. రణబీర్ కపూర్ తో డేటింగ్ లో ఈ బ్యూటీ, అతడితో పెళ్లికి ముందే శారీరకంగా కలిసింది. ఫలితంగా గర్భవతి అయింది. దీంతో హుటాహుటిన రణబీర్-అలియా పెళ్లి చేసుకున్నారు. తను పెళ్లికి ముందే గర్భందాల్చిన విషయాన్ని, ఆ తర్వాత ఓ సందర్భంలో అలియా భట్ వెల్లడించింది.

ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై సెటైర్ వేసింది తాప్సి. తాజాగా తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ పెట్టింది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన తాప్సి, తానింకా గర్భం దాల్చలేదని, గర్భవతిని అయినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ స్పందించింది.

అలియా భట్ ను దృష్టిలో పెట్టుకొని తాప్సి ఈ కామెంట్స్ చేసినట్టు చాలామంది భావిస్తున్నారు. ఇదే టైమ్ లో ఇలియానా ప్రస్తావన కూడా వచ్చింది. ఆమె కూడా అంతే. తన బాయ్ ఫ్రెండ్ ఎవరో బయటకు చెప్పకుండానే, అతడితో పెళ్లి కూడా జరక్కముందే గర్భం దాల్చింది. రేపోమాపో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

తాప్సి స్టేట్ మెంట్ చూస్తుంటే, ఇకపై చాలామంది హీరోయిన్లు ఇలా పెళ్లికి ముందే గర్భం దాల్చి, ఆ తర్వాత తాపీగా పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News