Tapsee | ప్రీతి జింటాలా కనిపించడానికి ప్రయత్నించిన తాప్సి
Tapsee - రింగుల జుట్టు తాప్సి ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉంటుంది. ఈసారి మరింత కొత్త విషయాన్ని బయటపెట్టింది.
బాలీవుడ్ బ్యూటీ తాప్సి గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్, మంచు మనోజ్ హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఆ తరవాత చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఛాన్సులు రాక బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం భలేగా క్లిక్ అయింది. వరుసగా అవకాశాలు, హిట్స్ కూడా వచ్చాయి.
బాలీవుడ్ కి వెళ్ళడానికి గల కారణాలను క్రికెటర్ శిఖర్ దావన్ చేస్తున్న చాట్ షోలో బయటపెట్టింది తాప్సి. తన బాలీవుడ్ ఎంట్రీకి ప్రీతి జింటాకు సంబంధం ఉందని వెల్లడించింది. ఈ వారం శిఖర్ దావన్ నిర్వహించిన చాట్ షోలో అతిథిగా పాల్గొన్న తాప్సి, ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తను చూడ్డానికి ప్రీతి జింటాలా ఉండడం వల్ల అవకాశాలు వచ్చినట్టు తెలిపింది. అందుకే చాలా సందర్భాల్లో ప్రీతి జింటాలా ఉండడానికి ప్రయత్నించానని తెలిపింది.
ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగానే తెలుగు, తమిళ భాషల నుంచి ఆఫర్లు వచ్చాయంట తాప్సీకి. ఆ సినిమాలు చేస్తూనే, బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసినట్టు వెల్లడించింది. ప్రస్తుతం తను ఉన్న స్థితికి చాలా గర్వపడుతున్నానని ఈ సందర్భంగా తెలిపింది.