Sundeep Kishan | రాయన్ టైటిల్ వెనక కథ ఇదే

Sundeep Kishan - రాయన్ టైటిల్ వెనక సీక్రెట్ బయటపెట్టాడు హీరో సందీప్ కిషన్. ఈ సినిమాలో ఇతడు కీలక పాత్ర పోషించాడు.

Advertisement
Update:2024-07-24 21:41 IST

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా చేసిన సినిమా రాయన్. కెరీర్ లో ధనుష్ కు ఇది 50వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ పీక్ లో జరుగుతోంది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో హీరో సందీప్ కిషన్ సినిమా గురించి మాట్లాడాడు.

"ఇందులో మా ఇంటి పేరు రాయన్. తెలుగు సౌండింగ్ ఉండేలా ఏదైనా టైటిల్ ఉంటే బావుంటుందని ధనుష్ ని అడిగాను. ఇది నార్త్ మద్రాస్ లో జరిగే నికార్సైన స్టోరీ. తెలుగులో టైటిల్ మారిస్తే ఆ ఫ్లేవర్ మ్యాచ్ చేయలేం అన్నాడు. నార్త్ మద్రాస్ లో జరిగిన కథని టైటిల్ మార్చకుండా, తెలుగు డబ్బింగ్ లో చూడటమే బాగుంటుందని అన్నాడు."

ఇలా టైటిల్ వెనక మేటర్ బయటపెట్టాడు సందీప్ కిషన్. కేజీఎఫ్, తిరు సినిమాలు చూసినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేశారో, రాయన్ ని కూడా అంతే ఎంజాయ్ చేస్తారని అంటున్నాడు సందీప్ కిషన్.

Tags:    
Advertisement

Similar News