Roshan Kanakala - సుమ కొడుకు ఫస్ట్ లుక్ ఇదే

Roshan Kanakala - సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా నుంచి రోషన్ ఫస్ట్ లుక్ రిలీజైంది.

Advertisement
Update:2023-03-16 22:26 IST

క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి విజయవంత చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు, మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ డైరక్టర్. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో డీజేగా కనిపిస్తున్నాడు రోషన్. పోస్టర్‌లో రోషన్ గిరజాల జుట్టు, సన్ గ్లాసెస్‌తో, డీజే సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ హెడ్‌సెట్ ధరించి కనిపించాడు. పోస్టర్ చాలా ట్రెండీగా వుంది.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా రూపొందుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, నవీన్ యాదవ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

Tags:    
Advertisement

Similar News