Sriranga Neethulu | శ్రీరంగ నీతులు టీజర్ ఎలా ఉందంటే..?

Sriranga Neethulu - సుహాస్ కొత్త సినిమా శ్రీరంగనీతులు. ఈ సినిమా టీజర్ ను తాజాగా లాంచ్ చేశారు.

Advertisement
Update:2024-01-06 22:39 IST

యువ‌త‌రం భావోద్వేగాల‌తో, సినిమాలోని పాత్ర‌ల‌తో త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకునే క‌థ‌ల‌తో, స‌హ‌జంగా సాగే మాట‌లు, మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో వ‌చ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. స‌రిగ్గా అలాంటి సినిమానే శ్రీ‌రంగ‌నీతులు. ఈ చిత్రం టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌కుండా ఇదే ఫీల్ క‌లుగుతుంది.

ప్ర‌ముఖ న‌టుడు త‌నికెళ్ల భ‌ర‌ణి పాత్ర చెప్పే ఆహ్లాద‌క‌ర‌మైన మాట‌ల‌తో ప్రారంభ‌మై టీజ‌ర్ ఎంతో నేచుర‌ల్‌గా అనిపించే సంభాష‌ణ‌ల‌తో, స‌న్నివేశాల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకునే విధంగా కొన‌సాగుతుంది. విభిన్న‌మైన పాత్ర‌ల‌తో, వైవిధ్య‌మైన కథలతో సినిమాలు చేస్తూ త‌మ‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, విరాజ్ అశ్విన్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఇది.

ప్ర‌వీణ్‌ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు న్యూ ఇయర్ సందర్భంగా మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

ఈత‌రం యువ‌త ఆలోచ‌న‌ల‌ు, వారి ఎమోష‌న్స్‌ ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారు. సినిమాలో ఉండే ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌ు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే మ‌న‌సుకు హ‌త్తుకుంటాయట. హర్షవర్థన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

Full View

Tags:    
Advertisement

Similar News