Suhas | కేబుల్ రెడ్డిగా మారిన సుహాస్

Suhas Cable Reddy - సుహాస్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. దీనికి కేబుల్ రెడ్డి అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు.

Advertisement
Update:2023-08-18 21:33 IST

'రైటర్ పద్మభూషణ్' తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో సుహాస్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు శ్రీధర్ రెడ్డి తో చేతులు కలిపాడు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కేబుల్ రెడ్డి' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. షాలిని కొండేపూడి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. దర్శకుడు శ్రీధర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి, స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందించాడు.

సుహాస్, శ్రీధర్ చాన్నాళ్లుగా ఫ్రెండ్స్. అలా తన ఫ్రెండ్ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు సుహాస్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్ ఇది. మరో 2 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక చిన్న టౌన్ లో జరిగే కథగా ఈ సినిమా వస్తోంది.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను 20 రోజుల్లో పూర్తిచేయబోతున్నారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. స్మరణ్ సాయి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రైటర్ పద్మభూషణ్ టైపులోనే డిఫరెంట్ గా ఉంటూ, పూర్తిస్థాయిలో వినోదాన్ని అందిస్తుందంట ఈ కేబుల్ రెడ్డి సినిమా.




Tags:    
Advertisement

Similar News