RamaBanam - రామబాణం కథ అలా పుట్టింది

Sriwass Ramabanam - గోపీచంద్ హీరోగా రామబాణం సినిమా తెరకెక్కింది. అసలు ఈ కథ ఎలా పుట్టింది?

Advertisement
Update:2023-05-02 21:47 IST

'లక్ష్యం', 'లౌక్యం' వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శ్రీవాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నాడు. అసలు ఈ కథ ఎలా పుట్టిందో బయటపెట్టాడు.

"గోపీచంద్, నేను కలసి మళ్ళీ సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఒక మంచి యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నాను. అయితే ‘’లక్ష్యం, లౌక్యం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ క్లాస్ అందరూ లైక్ చేసిన కథలు. మళ్ళీ కలసి చేస్తున్నపుడు మన నుంచి ప్రేక్షకులు అలాంటి సినిమా కోరుకుంటారు'' అని గోపీచంద్ నేను భావించాం. ఆయనకి ఉండే యాక్షన్, ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరేలా అదే సమయంలో మంచి ఉద్దేశం ఉన్న కథ చేయాలని అనుకున్నాం. అన్నదమ్ముల అనుబంధం మీద ఓ కొత్త పాయింట్ దొరికితే దాన్ని అన్నీ ఎమోషన్స్ ఎలిమెంట్స్ ఉన్న కథ చేయడం జరిగింది."

ఇలా రామబాణం కథ పుట్టిన విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు. ఈ సినిమాకు లక్ష్యం-2 అనే టైటిల్ అనుకున్నారు. వర్కింగ్ టైటిల్ కూడా అదే. కాకపోతే బాలకృష్ణ అనుకోని విధంగా ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్ పెట్టడంతో, దాన్నే కొనసాగించారు.

Tags:    
Advertisement

Similar News