Sridevi Vijaykumar | అరుదైన రీఎంట్రీ

Sridevi Vijaykumar - దాదాపు దశాబ్దం తర్వాత శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఇచ్చింది. అది కూడా తిరిగి హీరోయిన్ గా కావడం విశేషం.

Advertisement
Update: 2024-08-27 06:41 GMT

హీరోయిన్ గా చేసి రిటైరైన తర్వాత, కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతుంటారు చాలామంది ముద్దుగుమ్మలు. అక్క, వదిన, తల్లి పాత్రలకు పరిమితమైపోతారు. హీరోయిన్ గా చేసి గ్యాప్ ఇచ్చి, మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కుదురుతుందా..? శ్రీదేవి విజయ్ కుమార్ ను చూస్తే సాధ్యమే అనిపిస్తుంది.

నటుడు విజయ్ కుమార్, నటి మంజుల నటవారసురాలిగా ఇండస్ట్రీకొచ్చిన శ్రీదేవి, దశాబ్దాల కిందటే హీరోయిన్ గా నటించింది. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్ ఈమె. ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. ఆ తర్వాత తరుణ్ లాంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది.

అలా కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసిన శ్రీదేవి, పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించేసింది. 2009లో రాహుల్ అనే బిజినెస్ మేన్ ను పెళ్లాడి, హైదరాబాద్ లో స్థిరపడింది. 8 ఏళ్ల ఓ పాప కూడా ఉంది.

37 ఏళ్ల వయసులో శ్రీదేవి మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. సుందరకాండ సినిమాలో నారా రోహిత్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది శ్రీదేవి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్నేళ్లయినా ఆమెలో అందం చెక్కుచెదరలేదు. అదే ఫిజిక్, అదే గ్లామర్. ఈ విషయంలో శ్రీదేవిని మెచ్చుకోవాల్సిందే.

Tags:    
Advertisement

Similar News