క‌ల్కి 2.. ఈసారి ఆ మార్పు చేయ‌క‌పోతే క‌ష్టం నాగ్ అశ్విన్‌

క‌ల్కి 2898 ఏడీ చూసిన సినీ ప్రియుల్లో చాలా మంది.. సెకండ్ పార్ట్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను మార్చ‌క‌పోతే క‌ష్ట‌మంటూ సోష‌ల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ కు సూచ‌న చేస్తున్నారు.

Advertisement
Update: 2024-06-30 08:36 GMT

మ‌హాన‌టి విడుద‌ల త‌ర్వాత ఏడేళ్లు గ్యాప్ తీసుకున్న డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌.. తాజాగా పురాణాలు, సైన్స్‌ ఫిక్ష‌న్ మిళితం చేసిన క‌ల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. పాన్ ఇండియా సెన్సేష‌న్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద వీర విహారం చేస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే 300 కోట్ల మార్క్ ను దాటేసింది. వీకెండ్ కావ‌డంతో ప్ర‌తి ఏరియాలోనూ హౌస్ ఫుల్స్ ప‌డుతున్నాయి.

ఇక‌పోతే క‌ల్కి సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్ర టీమ్ ముందుగా ప్రకటించలేదు. కానీ మూవీ క్లైమాక్స్ లో పార్ట్ 2కి బ‌ల‌మైన లీడ్ ఇచ్చారు. క‌ల్కి 2పై ప్రేక్ష‌కుల్లో ఆసక్తిని, అంచనాలను భారీగా పెంచేశారు. ఇదే తరుణంలో సీక్వెల్ గురించి నిర్మాత అశ్వినీ దత్ అదిరిపోయే అప్డేట్ ఇవ్వ‌డం జ‌రిగింది. క‌ల్కి సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయిందని.. మిగ‌తా భాగం చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతుంద‌ని మీడియాతో అశ్వినీ ద‌త్ తెలిపారు.

దీంతో ఇప్పుడు క‌ల్కి 2 విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. క‌ల్కి 2898 ఏడీ చూసిన సినీ ప్రియుల్లో చాలా మంది.. సెకండ్ పార్ట్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను మార్చ‌క‌పోతే క‌ష్ట‌మంటూ సోష‌ల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ కు సూచ‌న చేస్తున్నారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. క‌ల్కి చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ అందించిన సంగీతం ప్రేక్ష‌కుల‌కు సంతృప్తిని ఇవ్వ‌లేక‌పోయింది. చాలా సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉందనే ఫీలింగ్ కలిగింది.

సినిమాకు మైన‌స్ అయిన అంశాల్లో మ్యూజిక్ కూడా ఒక‌టి. అయితే ప్ర‌భాస్‌-అమితాబ్ బ‌చ్చ‌న్ యాక్టింగ్, అద్భుతమైన విజువల్స్, వీఎఫ్‍ఎక్స్‌, నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే సినిమా మైన‌స్ ల‌ను క‌వ‌ర్ చేసేశాయి. కానీ క‌ల్కి 2 మ్యూజిక్ విష‌యంలో మాత్రం ఈ పొర‌పాటు రిపీట్ కాకూడ‌ద‌ని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే నాగ్ అశ్విన్ అండ్ టీమ్ క‌ల్కి 2 కోసం ఆస్కార్ గ్ర‌హీత ఎంఎం.కీర‌వాణి పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

Tags:    
Advertisement

Similar News