ప్రాజెక్ట్-కె పై సింగీతం రియాక్షన్ ఇది
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్టు-కె. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుకు కూడా భాగం ఉంది. ఇంతకీ ప్రాజెక్టు-కెకు సంబంధించి సింగీతం ఏం చేశారు?
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రాజెక్టు-కె. ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ప్రపంచాన్ని, ఎవ్వరూ వినని కథను ఈ సినిమాతో చెప్పబోతున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా పనిచేశారు. ఇంతకీ ప్రాజెక్టు-కెలో ఆయన పాత్ర ఎంత?
"ప్రాజెక్టు-కె షూటింగ్ లో నేను లేను. ఆ సినిమాతో నాకున్న అనుబంధం చాలా చిన్నది. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేశాడు. మార్పుచేర్పులు చేయమని నన్ను కోరాడు. అలా ప్రాజెక్టు-కె స్క్రిప్ట్ లో కొన్ని మార్పుచేర్పులు చేశానంతే. అక్కడితో నా పని అయిపోయింది."
ఇలా ప్రాజెక్టు-కె సినిమాలో తన పాత్ర, పరిధిని బయటపెట్టారు సింగీతం. టాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు దాదాపు ఆద్యుడిగా పేర్కొంటారు సింగీతం శ్రీనివాసరావును. ఆయన తీసిన ఆదిత్య-369 అనే సినిమా అఖండ విజయం సాధించింది. ఏకంగా నాసా సైంటిస్టులు సైతం ఆ మూవీని మెచ్చుకున్నారు.
తన కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలు తీయడానికే ఎక్కువ సమయం కేటాయించారు సింగీతం. ఇంకా చెప్పాలంటే, సింగీతం తీసిన ప్రతి సినిమాలో ఓ ప్రయోగం ఉంటుంది. అందుకే ప్రాజెక్టు-కె లాంటి అతిపెద్ద ప్రయోగాత్మక చిత్రానికి సింగీతం సేవలు వినియోగించుకుంది వైజయంతీ మూవీస్ సంస్థ.