Shraddha Das | కామెడీ ట్రై చేశానంటున్న శ్రద్ధా దాస్

Shraddha Das - పారిజాత పర్వం విడుదలకు సిద్ధమైంది. ఇందులో కాస్త కామెడీ ట్రై చేశానంటోంది శ్రద్ధా దాస్

Advertisement
Update:2024-04-17 08:11 IST

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ శ్రద్ధా దాస్ మీడియాతో మాట్లాడింది. తొలిసారి తను కామెడీ ట్రై చేసినట్టు వెల్లడించింది.

"కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు సినిమా చేశా. గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుంది. నా కోసం ఈ పాత్రను రాసిన డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్యూ. సునీల్, హర్ష, చైతన్యతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. వాళ్ల కామెడీ టైమింగ్‌ ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. కానీ నేను కొంచెం ట్రై చేశా."

ఇలా పారిజాతపర్వం సినిమాలో తను కామెడీ కూడా ట్రై చేశానని చెప్పుకొచ్చింది శ్రద్ధా దాస్. ఈ సినిమాలో కామెడీతో పాటు మంచి మలుపులు ఉంటాయని ఊరిస్తోంది.  

Tags:    
Advertisement

Similar News