Sivakarthikeyan | మురుగదాస్ తో కలిసి సెట్స్ పైకి...!

Sivakarthikeyan: ఎట్టకేలకు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు శివకార్తికేయన్. ఇదొక యాక్షన్ మూవీ.

Advertisement
Update: 2024-02-15 17:03 GMT

శివకార్తికేయన్ హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం నిన్న పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ఉదయం మొదలైంది.

అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన మురుగదాస్ దర్శకత్వంలో, శివకార్తికేయన్ నటించడం ఇదే తొలిసారి. ఇదొక యాక్షన్ మూవీ. ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందిస్తుందని చెబుతున్నారు. ఇంతకుముందు శివకార్తికేయన్ ఎప్పుడూ కనిపించని డిఫరెంట్ లుక్, మేనరిజమ్స్ తో కనిపించనున్నాడు.

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మొదటి రోజు షూటింగ్ లో ఆమె కూడా జాయిన్ అయింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాలో మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

Tags:    
Advertisement

Similar News