Sharwanand | కెరీర్ లో తొలిసారి అలా..!

Sharwanand - ఒకేసారి 2 సినిమాలు పూర్తి చేయబోతున్నాడు శర్వానంద్. 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

Advertisement
Update:2024-06-12 22:22 IST
Sharwanand | కెరీర్ లో తొలిసారి అలా..!
  • whatsapp icon

ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత వెంటనే సినిమా చేయాలనుకున్నాడు శర్వానంద్. కానీ పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే అతడి భార్య గర్భం దాల్చింది. దీంతో భార్య కోసం చాన్నాళ్ల పాటు అమెరికాలోనే ఉండిపోయాడు.

అలా కెరీర్ లో రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ లో ఒకే ఒక సినిమా చేశాడు. అదే మనమే మూవీ. ఇప్పుడీ రెండేళ్ల గ్యాప్ ను ఒకేసారి భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాడు శర్వానంద్. కెరీర్ లో తొలిసారి ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

మనమే సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే రామ్ అబ్బరాజు దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు శర్వా. ఈ మూవీ కంటే ముందే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

సో.. ప్రస్తుతం ఈ రెండు సినిమాల్ని పూర్తిచేసే పనిలో పడ్డాడు శర్వానంద్. రెండు సినిమాలకు మినిమం గ్యాప్స్ లో కాల్షీట్లు ఇస్తున్నాడు. దాదాపు ఈ 2 సినిమాల్ని ఒకేసారి పూర్తిచేయాలనేది శర్వా ఆలోచన.

Tags:    
Advertisement

Similar News