Sharwanand | లాంగ్ లీవ్ పెట్టిన శర్వానంద్
Sharwanand - ప్రస్తుతం శర్వానంద్ ఏ సినిమా చేయడం లేదు. చేతిలో ఉన్న సినిమాను కూడా తాత్కాలికంగా పక్కనపెట్టాడు. ఎందుకు?
హీరో శర్వానంద్ ఇప్పుడెక్కడున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్. ఆయన తన చేతిలో ఉన్న అన్ని సినిమాల్ని పక్కనపెట్టాడు. త్వరలోనే తండ్రి కాబోతున్నాడు ఈ హీరో. ఆ పితృత్వాన్ని అస్వాదించేందుకు తన భార్యతో కలిసి ఉంటున్నాడు.
శర్వానంద భార్య రక్షిత రెడ్డి ప్రస్తుతం ఆమెరికాలో ఉంటోంది. అక్కడే బిడ్డకు జన్మనివ్వబోతోంది. సో.. ఆమెతో గడిపేందుకు, ఆమెకు తోడుగా ఉండేందుకు శర్వానంద్ కూడా అమెరికా వెళ్లాడు. తన భార్య, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే ఇండియాకు తిరిగి రాబోతున్నాడు ఈ నటుడు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను తాత్కాలికంగా ఆపేశారు. శర్వా తిరిగి ఇండియాకొచ్చిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు శర్వానంద్. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఆల్రెడీ అఁగీకరించిన సినిమాను కూడా పక్కనపెట్టాడు. శ్రీరామ్ ఆదిత్య సినిమాకు ఓకే చెప్పాడు. అంతలోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇలా సినిమాల్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు శర్వానంద్.