Ramanna Youth: కాన్సెప్ట్ ట్రయిలర్ రిలీజ్
టాలీవుడ్ లో మరో కాన్సెప్ట్ మూవీ. దీని పేరు రామన్న యూత్. తెలంగాణ పల్లెల్లో క్షేత్రస్థాయిలో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయనే అంశంపై కాస్త ఫన్నీగా తీసిన సినిమా ఇది.
టాలీవుడ్ లో మరో కాన్సెప్ట్ సినిమా రెడీ అయింది. దీని పేరు రామన్న యూత్. ఈసారి నటుడు నవీన్ బేతిగంటి (ఇతడి అసలు పేరు అభయ్) దర్శకుడిగా మారి, తనే హీరోగా నటించి ఈ సినిమా తెరకెక్కించడం విశేషం. ఇన్నాళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు పోషించిన ఈ నటుడు, ఈసారి ఓ పొలిటికల్ బేస్డ్ కాన్సెప్ట్ సినిమాతో దర్శకుడిగా మారాడు.
తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అయింది. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశాడు. ట్రయిలర్ చూస్తే, ఇదొక రూరల్ పొలిటికల్ బేస్డ్ మూవీ అనే విషయం అర్థమౌతుంది. రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథ ఇది. అతని జీవితంలోకి మిగతా వారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారన్నది ఆసక్తికరంగా చూపించారు.
ఈ కథలో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ సాగుతుంటుంది. ఈ ఆరు పాత్రలు కథకు ఎలా లింక్ అయ్యారన్నది సినిమా. ట్రయిలర్ లో పాత్రలన్నీ చాలా సహజంగా ఉన్నాయి. కమ్రాన్ సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది రామన్న యూత్ సినిమా.